ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'దేశమంతా ఉల్లి సమస్యే... పవన్​కు అవగాహన లేదు' - ఉల్లి ధరలపై పవన్ వ్యాఖ్యలు న్యూస్

తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్​పై  మంత్రి కొడాలి నాని విమర్శలు గుప్పించారు. తెదేపా-2గా జనసేన మారిపోయిందని ధ్వజమెత్తారు.

minister kodali nani
minister kodali nani

By

Published : Dec 3, 2019, 8:03 PM IST

ఉల్లి ధరపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను మంత్రి కొడాలి నాని ఖండించారు. ఈ సమస్య దేశ వ్యాప్తంగా ఉందని... రాష్ట్రానికే పరిమితం కాలేదని సమాధానమిచ్చారు. పవన్ కల్యాణ్అవగాహనతో మాట్లాడాలని హితవుపలికారు. చంద్రబాబు అమరావతిలో పర్యటించినప్పుడు రైతులే నిరసన తెలిపారని... మంత్రి కొడాలి పేర్కొన్నారు. చంద్రబాబు రాయలసీమ పర్యటనలో దాడులు ఎందుకు జరగలేదని ప్రశ్నించారు. రైతుల భూములు తీసుకున్నందుకే అలా చేశారని వ్యాఖ్యానించారు. ప్రజలు గుర్తించే... వైకాపాకు 151 సీట్లు ఇచ్చారని... జనసేనకు ఒక స్థానం మాత్రమే ఇచ్చారని ఎద్దేవా చేశారు.

ABOUT THE AUTHOR

...view details