పోలవరం విషయంలో ప్రభుత్వ విధానాలు తప్పని హైకోర్టు ఎక్కడా చెప్పలేదని మంత్రి కొడాలి నాని అన్నారు.టెండరింగ్ ప్రక్రియను తాత్కాలికంగా నిలుపుదల చేయమని మాత్రమే చెప్పిందన్నారు.అవినీతి,దోపిడీని అరికట్టేందుకే ముఖ్యమంత్రి రివర్స్ టెండరింగ్ ప్రక్రియను తెచ్చారని కొడాలి పేర్కొన్నారు.ఈ విషయాన్ని న్యాయపరంగా ఎదుర్కొంటామని వివరించారు.పోలవరం విషయంలో ముఖ్యమంత్రి అడుగులు ముందుకే కాని వెనుకకు పడవని చెప్పారు.
మంత్రి బొత్స మాటల్లో తప్పులేదు