డిసెంబర్ 1వ తేదీ నుంచి ఇంటింటికీ నాణ్యమైన బియ్యం పంపిణీ చేస్తామని మంత్రి కొడాలి నాని అన్నారు. పర్యావరణానికి హాని కలగకుండా ఉండేందుకే ప్యాకింగ్ విధానాన్ని మార్చి వాహనాల్లో సరఫరా చేస్తున్నామని తెలిపారు. నాణ్యమైన బియ్యాన్ని ప్రజలకు అందించడమే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు.
డిసెంబర్ 1 నుంచి ఇంటింటికీ నాణ్యమైన బియ్యం: మంత్రి కొడాలి - డిసెంబర్ 1 నుంచి నాణ్యమైన బియ్యం పంపిణీ న్యూస్
డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ఇంటింటికీ నాణ్యమైన బియ్యం పంపిణీ చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తెలిపారు. కృష్ణా జిల్లా గుడివాడ మండలం లింగవరంలో ఇంటింటికీ రేషన్ బియ్యం పంపిణీ డెమో కార్యక్రమాన్ని మంత్రి పరిశీలించారు.

డిసెంబర్ 1 నుంచి ఇంటింటికీ నాణ్యమైన బియ్యం: కొడాలి నాని