ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కేంద్రం పెంచితే తప్పులేదు.. మేం పెంచితే తప్పా!: కొడాలి నాని - మంత్రి కొడాలి నాని తాజా అప్ డేట్స్

రోడ్ల మరమ్మతుల కోసం పెట్రోలు, డీజిల్​పై రూపాయి పెంచితే ఎందుకు గగ్గోలు పెడుతున్నారని మంత్రి కొడాలి నాని అన్నారు. కేంద్రం రూ. 10 పెంచితే ఎవరూ ప్రశ్నించలేదని.. తాము రోడ్ల అభివృద్ధి కోసం రూపాయి పెంచితే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

minister kodali nani about petro cess
కొడాలి నాని, మంత్రి

By

Published : Sep 19, 2020, 3:31 PM IST

Updated : Sep 19, 2020, 4:35 PM IST

కొన్ని రోజులుగా కేంద్రం పెట్రోలు ధరలు పెంచుతూ ఉంటే మాట్లాడని వాళ్లంతా రాష్ట్రప్రభుత్వాన్ని ఎందుకు తప్పుపడుతున్నారని ప్రశ్నించారు పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని. డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు మోదీ 10 రూపాయలు పెంచితే ఎవరూ మాట్లాడలేదన్నారు. ఇప్పుడు రూపాయి సెస్ వేసి రహదారులు మరమ్మతులు చేయించాలని భావిస్తే విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఆదాయం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.

'ప్రధాని మోదీ ఇప్పటివరకు పెట్రోలు, డీజిల్​పై రూ. 10 పెంచితే ఎవరూ మాట్లాడలేదు. రాష్ట్రంలో రోడ్ల మరమ్మతుల కోసం రూపాయి పన్ను వేస్తే విమర్శలు చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్​పై వసూలు చేసే ఒక్క రూపాయి సెస్ వల్ల పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలతో రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. ఇదెవరూ ఆలోచించట్లేదు'-- కొడాలి నాని, మంత్రి

Last Updated : Sep 19, 2020, 4:35 PM IST

ABOUT THE AUTHOR

...view details