ఇటీవల హత్యకు గురైన భాస్కరరావు హత్య కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం ఉందని మంత్రి కొడాలి నాని ఆరోపించారు. కృష్ణా జిల్లా గుడివాడలో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. రవీంద్ర ఏ తప్పూ చేయకపోతే మచిలీపట్నం నుంచి ఎందుకు పారిపోయారో చెప్పాలని డిమాండ్ చేశారు.
కొల్లు రవీంద్ర ప్రోద్బలంతోనే హత్య జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో తేలిందని.. అందుకే అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. ఆయన తప్పు చేసినట్లు ఆధారాలు దొరికాయని.. తప్పు చేసినవాళ్లకు శిక్ష తప్పదని అన్నారు.