ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆహార శుద్ధి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట' - ఆహారశుద్ధి పరిశ్రమలపై వార్తలు

ఆహార శుద్ధి పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి కన్నబాబు చెప్పారు. సచివాలయంలో అధికారులతో ఈ రంగంపై సమీక్షించారు. ఉపాధి అవకాశాలు పెంచుతూ, ఆహార ఉత్పత్తులకు అదనపు విలువలు చేకూర్చేలా నూతన పాలసీని రూపొందించాలని అధికారులకు సూచించారు.

ఆహార శుద్ధి కేంద్రాలపై మంత్రి
ఆహార శుద్ధి కేంద్రాలపై మంత్రి

By

Published : Jul 16, 2020, 10:17 PM IST

రాష్ట్రంలో ఆహార శుద్ధి పరిశ్రమలను అభివృద్ధి చేయడానికి సమగ్ర చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అధికారులను ఆదేశించారు. ఉపాధి అవకాశాలు పెంచుతూ, ఆహార ఉత్పత్తులకు అదనపు విలువలు చేకూర్చేలా నూతన పాలసీని రూపొందించాలన్నారు. పాలసీ తయారీలో నాబార్డు వారి విధానాలు, ప్రోత్సాహకాలను దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ఆహార శుద్ధి పరిశ్రమ అభివృద్ధిపై సచివాలయంలో సంబంధిత అధికారులతో సమీక్షించారు.

వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఫుడ్ ప్రాసెస్సింగ్ సి.ఈ.ఓ శ్రీధర్ రెడ్డి,కె.పి.ఎం.జి కన్సల్టెంట్స్ పాల్గొన్నారు. రాష్ట్రంలో ఆహార శుద్ధి పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేయనుందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో గ్రామీణ ఉపాధితో పాటు గ్రామీణ ఆర్థిక స్థితిగతలను మెరుగుపరిచేలా సీఎం సూచనలు చేశారన్నారు. ప్రతి జిల్లాకు ఒక ఆహారశుద్ధి ప్రాసెసింగ్ యూనిట్ ను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details