ఏపీని టైక్స్‌టైల్ హబ్‌గా మార్చుతామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. అన్ని రంగాల్లో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ను కేంద్రబిందువుగా మార్చుతామన్నారు. కొవిడ్ ప్రపంచంలో వాణిజ్య, పెట్టుబడుల అవకాశాలను అందిపుచ్చుకుంటూ.. ముందుకెళ్తున్నామని తెలిపారు.
టైక్స్‌టైల్ రంగంపై నిర్వహించే ఇన్వెస్ట్ ఇండియా ఎక్స్‌క్లూజివ్ ఇన్వెస్ట్మెంట్ ఫోరమ్ వెబినార్‌ను కేంద్ర చేనేత శాఖ మంత్రి స్మృతి ఇరానీ ప్రారంభించారు. కర్ణాటక, ఝార్ఖండ్, ఒడిశా, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన చేనేత శాఖ మంత్రులు, ఇతర రాష్ట్రాల ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్ట్రంలో నేతన్నల సంక్షేమం, చేనేత ఉత్పత్తులు, వారి కళానైపుణ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపునకు, మార్కెటింగ్ అంశాలపై ఏపీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను, భవిష్యత్‌లో ఆచరణలో పెట్టబోయే వినూత్న ఆలోచనలను మంత్రి గౌతమ్ రెడ్డి వివరించారు. రాష్ట్రంలో ఉత్పత్తైన నూలును ఫాబ్రిక్గా మార్చడం.. గార్మెంట్స్, గ్లోబల్ టెక్స్‌టైల్ రంగంలో గమ్యస్థానంగా మార్చడంపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.