ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

త్వరలో నూతన పారిశ్రామిక విధానం: గౌతంరెడ్డి - Minister goutham reddy

రాష్ట్రం నుంచి పరిశ్రమలు వెనక్కిపోతున్నాయనే వార్తల్లో వాస్తవం లేదని మంత్రి గౌతం రెడ్డి పేర్కొన్నారు. పెట్టుబడిదారులను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. త్వరలో నూతన పారిశ్రామిక విధానం రూపొందించనున్నట్లు తెలిపారు.

పెట్టుబడిదారులు హామీలన్నీ నెరవేరుస్తాం : గౌతం రెడ్డి

By

Published : Aug 20, 2019, 6:26 PM IST

పరిశ్రమల ఇన్సెంటివ్స్ భారంగా మారాయి : గౌతం రెడ్డి

రాష్ట్రం నుంచి పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోతున్నాయన్న వార్తల్లో వాస్తవం లేదని పరిశ్రమలశాఖ మంత్రి గౌతం రెడ్డి అన్నారు. విజయవాడలో మాట్లాడిన ఆయన...రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అనువైన పరిస్థితులు ఉన్నాయన్నారు. రాష్ట్రానికి పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నామని స్పష్టం చేశారు. త్వరలో కొత్త పారిశ్రామిక విధానం తెస్తున్నామన్నారు. ఇండోనేషియా పేపర్ కంపెనీ తరలిపోలేదని.. ఆ సంస్థతో చర్చలు జరుగుతున్నాయన్నారు. పెట్టుబడిదారులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. పరిశ్రమలు పెట్టిన తర్వాత కూడా వారికిచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని గౌతంరెడ్డి తెలిపారు. పరిశ్రమలు పెట్టేముందు పారిశ్రామికవేత్తలు రాయితీలనుపరిశీలిస్తారని మంత్రి తెలిపారు. స్థానికులకు 75 శాతం రిజర్వేషన్ల వలన స్థానికుల నైపుణ్యాలు పెంపొందించేందుకు ఉపయోగపడుతుందన్నారు. పరిశ్రమలకు హామీ ఇచ్చిన ఇన్సెంటివ్స్ గత ప్రభుత్వం చెల్లించలేదన్న మంత్రి... ఆ హామీలు ఎలా నెరవేరుస్తారని పెట్టుబడిదారులు ప్రశ్నిస్తున్నారన్నారు. వీటిన్నింటినీ పరిశీలించి నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తున్నామన్నారు.

ABOUT THE AUTHOR

...view details