కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడు గ్రామంలో ఈనెల 21న సీఎం జగన్ పర్యటించనున్నారు. "వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు- భూ రక్ష" పథకం ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఏర్పాట్లు పరిశీలించారు. భూవివాదాలు తొలగిపోవాలనే ఆశయంతో సీఎం జగన్ భూ సర్వే కార్యక్రమాన్ని చేపడుతున్నారని మంత్రి అన్నారు. సర్వే సమయంలో ప్రజలు.. అధికారులకు సహకరించాలని ధర్మాన కోరారు. ఈ సర్వేల ద్వారా భూ సమస్యలు తొలగి గ్రామాలు ప్రశాంతంగా ఉంటాయని మంత్రి ఆకాంక్షించారు.
సీఎం తక్కెళ్లపాడు పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి ధర్మాన - land survey in ap latest news
కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడు గ్రామంలో ఈనెల 21న సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో.. మంత్రి ధర్మా కృష్ణదాస్ ఏర్పాటు పరిశీలించారు.
![సీఎం తక్కెళ్లపాడు పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి ధర్మాన cm jagan takkellapadu tour](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9932481-1064-9932481-1608362434327.jpg)
సీఎం తక్కెళ్లపాడు పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి ధర్మాన
జగ్గయ్యపేట పట్టణంలోని శ్రీమతి గెంటేల శకుంతలమ్మ కళాశాల ఆవరణలో భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ సభ ఏర్పాట్లను మంత్రి ధర్మాన కృష్ణదాస్, చీఫ్ కమిషనర్ ఆఫ్ లాండ్ అడ్మినిస్ట్రేషన్ నీరబ్ కుమార్ ప్రసాద్, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, కృష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్, రెవిన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిద్దార్ధ జైన్ పరిశీలించారు.
సీఎం తక్కెళ్లపాడు పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి ధర్మాన
ఇదీ చదవండి: ఎమ్మెల్యేలు గ్రామాలకు వెళ్లాలి: సీఎం జగన్