Finace minister Buggana comments : అనుభవజ్ఞుడైన యనమల జీఎస్డీపీని గణించటంలో తప్పుచేశారని మంత్రి ఆక్షేపించారు. నవరత్నాల ద్వారా ఇప్పటికి రూ.1.92 లక్షల కోట్లు అందించినట్టు వెల్లడించారు. ఖజానా ఖాళీ రూ.100 కోట్లు మాత్రమే మిగిలిందంటూ వ్యాఖ్యలు చేయడం సరికాదని మంత్రి అన్నారు. గత మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు కేవలం రూ.1,34,452 కోట్లు మాత్రమేనని మంత్రి బుగ్గన వెల్లడించారు.
2021-22 ఏడాదిలో 11.22 శాతం వృద్ధి :టీడీపీ సీనియర్ నేత యనమల చేసిన ప్రకటనపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై యనమల నిరాధార ఆరోపణలు, అసత్య ప్రకటనలు చేస్తున్నారని మంత్రి ఆక్షేపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై టీడీపీ రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తోందని మంత్రి బుగ్గన ఆరోపిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. స్థిరధరల వృద్ధి రేటులో 2021-22 ఏడాదికి సంబంధించి ఏపీ 11.22 శాతం వృద్ధి నమోదు చేసిందని మంత్రి స్పష్టం చేశారు. ఏవిధంగా లెక్కవేసినా మైనస్ 4 శాతం వృద్ధి అనేది అసాధ్యమని అసత్యమని మంత్రి వెల్లడించారు.
జీఎస్టీ గణించడంలో తప్పు చేశారు : కోవిడ్ సమయంలో దేశవృద్ధిరేటు -6.60 శాతంగా నమోదైతే ఏపీ 0.08 శాతం మేర వృద్ధి నమోదు చేసిందని గుర్తు చేశారు. అనుభవజ్ఞుడైన యనమల జీఎస్డీపీని గణించటంలో తప్పుచేశారని మంత్రి ఆక్షేపించారు. నవరత్నాల ద్వారా ఇప్పటికి రూ.1.92 లక్షల కోట్లు అందించినట్టు వెల్లడించారు. ప్రతీ ఊరిలోనూ ఏర్పాటైన సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజి క్లీనిక్ లు, డిజిటల్ లైబ్రరీలు, మిల్క్ చిల్లింగ్ కేంద్రాలను అభివృద్ధిగా పరిగణించరా..? అని మంత్రి పశ్నించారు. ఖజానా ఖాళీ రూ.100 కోట్లు మాత్రమే మిగిలిందంటూ వ్యాఖ్యలు చేయడం సరికాదని మంత్రి అన్నారు.
ఆ వ్యాఖ్యలు బాధ్యతా రాహిత్యం :రాష్ట్ర ఆర్థిక పరిస్థితి శ్రీలంక, జింబాబ్వేలా తయారైందని వ్యాఖ్యలు చేయటం బాధ్యతా రాహిత్యమన్నారు. 40 ఏళ్లు పైబడిన యువనాయకుడు సీఎంగా ఎలా అభివృద్ధి చేస్తున్నాడో అర్థం కాక టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారని మంత్రి బుగ్గన ఎద్దేవా చేశారు. 2019లో టీడీపీ దిగిపోయే నాటికి రూ.2,64,451 కోట్ల అప్పు ఉంటే.. 2022 నాటికి రూ.3,98,903 కోట్లు అయినట్టు పార్లమెంటులో కేంద్రం ప్రకటించిందని మంత్రి అన్నారు. గతమూడేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు కేవలం రూ.1,34,452 కోట్లు మాత్రమేనని మంత్రి బుగ్గన స్పష్టం చేశారు.
ఇవీ చదవండి :