రాజ్యసభ ఎన్నికల్లో సంఖ్యా బలం లేదని తెలిసినా తెదేపా అభ్యర్దిని నిలపటం సరికాదని పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. గతంలో సంఖ్యా బలం ఉన్నప్పుడు గుర్తురాని దళితులు, సంఖ్యా బలం లేనప్పుడు గుర్తొచ్చారా అని ఆయన ఎద్దేవాచేశారు. ఓటమి తధ్యమని తెలిసినా వర్ల రామయ్యను బరిలోకి దింపటం దళితులను అవమానించటమేనన్నారు. చంద్రబాబు జీవితం అంతా కుట్ర రాజకీయాలేనని మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగం వినటం ఇష్టం లేని చంద్రబాబు గవర్నర్ను ఎలా కలుస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు రాజకీయ పుస్తకంలో పేజీ చినిగిపోయిందని, ఇక కొత్త పేజీలు లేవన్నారు. ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారం పార్టీ చూసుకుంటుందని బొత్స సత్యనారాయణ తెలిపారు.
సంఖ్యా బలం లేదని తెలిసినా బరిలో నిలపటం సరికాదు: మంత్రి బొత్స - minister botsa satyanarayana latest news
రాజ్యసభ ఎన్నికల్లో సంఖ్యా బలం లేదని తెలిసినా... తెదేపా అభ్యర్థిని బరిలో నిలపటం సరికాదని పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. చంద్రబాబు జీవితం అంతా కుట్ర రాజకీయాలేనని ఆయన మండిపడ్డారు.
చంద్రబాబుపై మంత్రి బొత్ససత్యనారాయణ మండిపాటు