ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

104,108 కొత్త వాహనాలు ప్రారంభించడం ఓర్వలేకే విమర్శలు: బొత్స - minister botsa satyanarayana news

తెదేపా హయాంలో 104, 108 సర్వీసులు నిర్వీర్యమయ్యాయని మంత్రి బొత్స ఆరోపించారు. సీఎం జగన్ కొత్త 104, 108 వాహనాలను ప్రారంభించడం సహించలేక చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కరోనా టెస్టులపై తెదేపా అధినేత చంద్రబాబు విమర్శలు చేయడం సరికాదన్నారు.

minister
minister

By

Published : Jul 1, 2020, 11:45 AM IST

రాష్ట్రంలో జరుగుతోన్న కరోనా టెస్టులపై తెదేపా అధినేత చంద్రబాబు విమర్శలు చేయడంపై వైకాపా మండిపడింది. దేశంలో ఎక్కడాలేని రీతిలో ఇప్పటివరకు 9 లక్షల టెస్టులు చేశామని మంత్రి బొత్స తెలిపారు. మంగళవారం ఒక్కరోజే 30 వేల పరీక్షలు చేసినట్లు పేర్కొన్నారు. దీనిపై చంద్రబాబు అసత్యాలు చెప్పడం దారుణమన్నారు. చంద్రబాబు రాష్ట్రాన్ని 2.75 లక్షల కోట్లు అప్పుల ఊబిలోకి నెట్టారన్న బొత్స.. తెదేపా హయాంలో ఎఎస్ఎంఈలకు వేల కోట్ల బకాయులు పెట్టారని.. పరిశ్రమలకు పెట్టిన బకాయిలను తాము తీర్చుతుంటే విమర్శలు చేయడం తగదన్నారు.

తెదేపా హయాంలో 104,108లు నిర్వీర్యమయ్యాయని మంత్రి బొత్స ఆరోపించారు. సీఎం జగన్ కొత్త 104, 108 వాహనాలను ప్రారంభించడం సహించలేక చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. విశాఖలో ఇళ్ల స్థలాలను స్వచ్ఛందంగా సేకరించామని.. ఎక్కడా దౌర్జన్యంగా భూములు లాక్కోలేదని బొత్స స్పష్టం చేశారు. ఎక్కడైనా అవినీతి, అవకతవకలు జరిగినట్లు నిరూపిస్తే దానికి బాధ్యత తాను వహిస్తాననని మంత్రి బొత్స సవాల్ చేశారు.

నిర్ణీత సమయంలో పరిశ్రమ నెలకొల్పకపోవడం వల్లే చిత్తూరు జిల్లా అమరరాజా ఇన్ ఫ్రాటెక్ కి కేటాయించిన భూముల.. కేటాయింపులను ప్రభుత్వం రద్దు చేసిందని ఆయన తెలిపారు. భూముల రద్దు ప్రభుత్వం నిబంధనల మేరకే వ్యవహరించిందని.. ఎక్కడా కక్షపూరితంగా వ్యవహరించలేదని మంత్రి బొత్స పేర్కొన్నారు.

ఇదీ చదవండి:కొత్త 108, 104 వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్‌

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details