Botsa Respond on Manipur Issue : మణిపూర్ నుంచి విద్యార్థులను తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మణిపూర్లో 150 మంది ఏపీ విద్యార్థులు ఉన్నట్లు అంచనా ఉందన్న బొత్స.. ఇప్పటికే వంద మంది తెలుగు విద్యార్థుల వివరాలు సేకరించామని వెల్లడించారు. పర్యవేక్షణ కోసం ఐఏఎస్‌లు.. హిమాన్షు కౌశిక్, కమిషనర్, ఏపీ భవన్, కాంటాక్ట్ నంబర్ 88009 25668, రవిశంకర్, ఓఎస్‌డీ, ఏపీ భవన్, కాంటాక్ట్ నంబర్ 91871 99905 నియమించినట్లు మంత్రి తెలిపారు. మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నిట్, ఐఐటీ, సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు టచ్లో ఉన్నారని, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి స్టూడెంట్స్ లిస్ట్ ఔట్ చేశామని, వారికి అన్ని విధాలా అండగా ఉంటామని మంత్రి బొత్స తెలిపారు.
సివిల్ ఏవియేషన్ మినిష్టర్తో మాట్లాడి విద్యార్థులను రాష్ట్రానికి రప్పించే ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. విద్యార్థుల కోసం హెల్ప్ లైన్ ఏర్పాటు చేశామన్నారు.. వివరాలు నమోదు చేసుకుంటే తీసుకొచ్చే ఏర్పాటు చేస్తాం.. తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చెందకండి అని పేర్కొన్నారు. ఇప్పటివరకు సుమారు 100 వరకు విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారని, ఇంకా 50 మంది వరకు ఉండొచ్చు అని అంచనా వేస్తున్నామని చెప్తూ.. 150 మంది కి సరిపడా విమానం ఏర్పాటు చేశామని వెల్లడించారు.