కృష్ణాజిల్లా కంచికచర్లలో బోటు ప్రమాదంలో గల్లంతైన బాలిక కుటుంబాన్ని మంత్రుల బృందం పరామర్శించింది. మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని, పేర్ని నాని, స్థానిక ఎమ్మెల్యే తో పాటు జిల్లా కలెక్టర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని, త్వరలోనే రూ.5 లక్షల పరిహారం చెలిస్తామని వారు తెలిపారు. ఘటనకు కారణమైన సంఘటనా స్థలాన్ని పరిశీలించి, బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరలో చేపట్టనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు పేర్కొన్నారు.
గల్లంతైన బాలిక కుటుంబాన్ని పరామర్శించిన మంత్రులు - కంచికచర్ల
కృష్ణాజిల్లా కంచికచర్లలో గల్లంతైన బాలిక కుటుంబాన్ని పరామర్శించిన మంత్రుల బృందం. బాధిత కుటుంబానికి నష్టపరిహారంగా రూ.5 లక్షలు చెల్లిస్తామని ప్రకటన.
గల్లంతైన బాలిక కుటుంబాన్ని పరామర్శించిన మంత్రులు