ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

MINISTER ANIL KUMAR YADAV: 'మాకు కొడాలి నాని తప్ప ఏ నానీ తెలీదు' - kodali nani

ఏపీ ప్రభుత్వం టికెట్ ధరలు తగ్గించి ప్రేక్షకుల్ని అవమానిస్తున్నారంటూ హీరో నాని చేసిన వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు. తమకు ఏ నానీలూ తెలీదని తెలిసిందల్లా కొడాలి నానీ మాత్రమేనని అన్నారు.

minister-anil-kumar-yadav-responds-on-hero-nani-comments
'మాకు కొడాలి నాని తప్ప ఏ నానీ తెలీదు'

By

Published : Dec 24, 2021, 12:21 PM IST

'మాకు కొడాలి నాని తప్ప ఏ నానీ తెలీదు'

ఏపీ ప్రభుత్వం టికెట్ ధరలు తగ్గించి ప్రేక్షకుల్ని అవమానిస్తున్నారంటూ సినీ హీరో నాని చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. ప్రభుత్వం సినిమా టికెట్ ధరలు తగ్గించడాన్ని ప్రజలు హర్షిస్తుంటే సినిమా హీరోలకు కడుపు మంట ఎందుకని అన్నారు. సినిమా హీరోలు రెమ్యునరేషన్ తగ్గించుకుని ఆ ప్రయోజనాల్ని ప్రేక్షకులకు బదిలీ చేయాలని ఆయన పేర్కొన్నారు. తమకు ఏ నానీలూ తెలీదని తెలిసిందల్లా కొడాలి నానీ మాత్రమేనని అన్నారు.

సినిమా పరిశ్రమలో జరిగే దోపిడీని అరికట్టేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. సినిమా ప్రొడక్షన్ ఖర్చు 30 శాతమైతే... సినిమా హీరోల రెమ్యూనరేషన్ 70 శాతం ఉంటోందని ఆయన అన్నారు. గతంలో సినీ ఫ్యాన్స్​గా కటౌట్లు కట్టి తానూ నష్టపోయానని ఇప్పుడు అసలు వాస్తవం తెలిసివస్తోందని వ్యాఖ్యానించారు.

ABOUT THE AUTHOR

...view details