కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని ముసునూరులో వైకాపా నాయకుల దాడిలో గాయపడిన తెదేపా కార్యకర్తలను మాజీమంత్రి పీతల సుజాత, మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన వెంకటేశ్వరరావు పరామర్శించారు. వైకాపా నాయకుల అరాచకాలు ఎక్కువైపోతున్నాయని, అమరావతిలో ఎస్సీలను నామినేషన్ వేయకుండా, ప్రచారం చేయకుండా అడ్డుపడుతూ దాడులు చేస్తూ అరాచకాలు చేస్తున్నారని పీతల సుజాత మండిపడ్డారు. రోజురోజుకూ తెదేపా పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి వైకాపా నేతలకు మైండ్ బ్లాంక్ అవుతుందని విమర్శించారు. వైకాపా తీరు మార్చుకోకపోతే ప్రజలే తగిన రీతిలో బుద్ధి చెప్తారని హెచ్చరించారు.
వైకాపా నేతలకు మైండ్ బ్లాంక్ అవుతోంది: పీతల సుజాత - Pitala Sujatha comments on ycp
తెదేపా పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి వైకాపా నేతలకు మైండ్ బ్లాంక్ అవుతుందని.. మాజీమంత్రి పీతల సుజాత విమర్శించారు. రాష్ట్రంలో తెదేపా శ్రేణులపై దాడులు చేస్తూ అరాచకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. వైకాపా నాయకుల దాడిలో గాయపడిన తెదేపా కార్యకర్తలను ఆమె పరామర్శించారు.
వైకాపా నేతలకు మైండ్ బ్లాంక్ అవుతుంది: పీతల సుజాత