రాష్ట్రప్రభుత్వం కార్మికుల కోసం ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ విమర్శించారు. జగన్ అసమర్థత వల్ల కార్మికులు పస్తులుంటున్నారని... వారికి తక్షణమే రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం అందజేయాలని డిమాండ్ చేశారు. సీఎం అవగాహనలేమి వల్ల 60 లక్షల మంది అసంఘటిత కార్మికులు, 3 లక్షల మంది ఆటోడ్రైవర్లు, లక్షలాది మంది డ్రైవర్లు 40 రోజులుగా పస్తులుంటున్నారన్నారు. వీటికి జగన్ సమాధానం చెప్పాలన్నారు. కేంద్రం కరోనా కోసం ఇచ్చిన నిధులు ఏం చేశారో వెల్లడించాలని నిలదీశారు. కార్మికశాఖలో ఉన్న రూ.1600 కోట్ల నిధులను దారి మళ్లించారని ఆరోపించారు. మున్సిపాలిటీల్లో, అనుబంధ సంస్థల్లో, ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులకు జీతాలు సైతం ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు.
'సీఎం అసమర్థతతో లక్షలాది మంది కార్మికులు పస్తులు' - ఏపీలో కార్మికుల కష్టాలు
అసంఘటిత కార్మికులను ఆదుకోవటంలో ప్రభుత్వం విఫలమైందని తెదేపా నేత బొండా ఉమ విమర్శించారు. సీఎం జగన్ అసమర్థతతో కరోనా కాలంలో లక్షలాది మంది కార్మికులు పస్తులుంటున్నారని మండిపడ్డారు. వారికి వెంటనే ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.
bonda uma