కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో వలస కూలీల ఆందోళన చేశారు. తమను వెంటనే సొంత రాష్ట్రాలకు పంపాలన్నారు. జగ్గయ్యపేట ఎంసీఎల్ పరిశ్రమలో సుమారు 1,460 మంది వలస కూలీలు పనిచేస్తుండగా.. వారిలో చాలా మంది బిహార్, ఝార్ఖండ్, ఒడిశాకు చెందివారు. వీరు చేసిన ఆందోళనకు.. రెవెన్యూ, పోలీసు అధికారులు స్పందించారు.
'ఆందోళన వద్దు.. 3 రోజుల్లో పంపించేస్తాం'
కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో చిక్కుకున్న బిహార్, ఝార్ఖండ్, ఒడిశాకు చెందిన వలస కూలీలు ఆందోళన చేశారు. తమను స్వస్థలాలకు పంపాలని నిరసనకు దిగారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి కూలీలను వారి రాష్ట్రాలకు పంపిస్తామని హామీ ఇచ్చారు.
కూలీల ఆందోళన...స్వస్థలాలకు పంపిస్తామని అధికారుల హామీ
వలస కూలీలను రైళ్లలో తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. ఆయా రాష్ట్రాల నుంచి అనుమతి రాగానే పంపించేస్తామని చెప్పారు. మంగళవారంలోగా పంపిస్తామని.. అప్పటివరకు బస, భోజనం కల్పిస్తామని హామీ ఇవ్వగా.. వారంతా ఆందోళన విరమించారు.