కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం ధర్మవరపుపాడు గ్రామంలో రాంకో సిమెంట్ కర్మాగారంలో L&T సంస్థకు చెందిన వలస కార్మికులు ఆందోళన చేశారు. జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బంగాకు చెందిన వలస కార్మికులు తమ స్వస్థలాలకు పంపిచాలంటూ నిరసన చేపట్టారు. వారి వద్దకు మాట్లాడేందుకు ప్రాంగణంలోకి వెళ్లిన స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్నాగేంద్రను నిర్బంధించారు. విషయం తెలిసి సంఘటనాస్థలానికి నందిగామ డీఎస్పీ రమణమూర్తి పెద్ద ఎత్తున సిబ్బందితో చేరుకున్నారు. రేపు సాయంత్రంలోగా స్వస్థలాలకు పంపిస్తామని పోలీసులు హామీ ఇవ్వటంతో కార్మికులు ఆందోళన విరమించారు.
ధర్మవరపుపాడులో సీఐను నిర్బంధించిన వలస కూలీలు - Migrants latest news
తమ స్వస్థలాలకు పంపించాలంటూ కృష్ణాజిల్లా ధర్మవరపుపాడులో వలస కూలీలు ఆందోళన చేశారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ను నిర్బంధించి..ఇంటికి పంపించే ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు.
ధర్మవరపు పాడులో వలసకూలీలు