బతుకు తెరువు కోసం వచ్చిన వలస కూలీలకు కరోనా వైరస్ కష్టాలు తెచ్చిపెట్టింది. తెలంగాణ సూర్యాపేట జిల్లాలో పలు ప్రాంతాలకు చెందిన కూలీలు పనుల కోసం కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలంలోని పలు గ్రామాలకు వచ్చారు. వీరంతా తిరిగి వెళ్లేందుకు ప్రజారవాణా సౌకర్యం లేని కారణంగా.. కాలినడకన వారి గ్రామాలకు బయల్దేరారు. వలస కూలీలు ఉదయాన్నే సామగ్రిని సంచిలో కట్టుకొని నెత్తిన పెట్టుకొని వారి స్వగ్రామాలకు పయనమయ్యారు. వీరిలో వృద్ధులు, చిన్న పిల్లలు ఉన్నారు. సుమారు వంద కిలోమీటర్ల మేర నడిచి వెళ్లాలని తెలిపారు. వాహనాలు లేకపోవడం వల్ల నడిచి పోవాల్సి వస్తుందని వాపోయారు. ప్రభుత్వాలు తమకు సహాయం అందించాలని కోరుతున్నారు.
మమ్మల్ని స్వస్థలాలకు పంపండి సారూ! - Krishna district migrants latest news
కరోనా వైరస్ మహమ్మరి ప్రభావం.. వలస కూలీలపై తీవ్రంగా పడింది. మరో నాలుగైదు రోజుల్లో పనులు ముగించుకొని స్వస్థలాలకు వెళ్లేందుకు సిద్ధమవుతుతున్న తరుణంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన కారణంగా.. రాష్ట్ర సరిహద్దులు పూర్తిగా మూసివేశారు. చేసేది లేక కాలినడకన సొంత ఊళ్లకు పయనమయ్యారు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా నుంచి కృష్ణా జిల్లాకు వచ్చిన వలసదారుల కష్టాలివి.
కాలినడకన స్వస్థలాలకు వెళ్తున్న వలస దారులు