ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాదాలు కరుగుతున్న.. కానరాని గూడు - వలస కూలీలు తాజా వార్తలు

మండే ఎండలు.. కాలే కడుపులు.. అరిగిన చెప్పులు.. పగిలిన పాదాలు.. తలపై బరువులు... చేతుల్లో సంచులు... చంకలో బిడ్డలు... నడవలేని దూరం.. గుప్పిట్లో ప్రాణాలతో వలసకూలీలు సొంతూళ్ల బాట పట్టారు. కష్టమైనా.. సుఖమైనా.. చావో బతుకో సొంతూరిలో ఉంటేనే మేలు. బతికుంటే బలుసాకు తినొచ్చు కానీ... ఇక్కడ పస్తులు ఉండలేం. భయంతో బతుకలేం. ఎవరు అడ్డుకొన్నా గమ్యాన్ని చేరుకొనే వరకూ ప్రయాణం ఆపమంటూ వలసకూలీలు కాలినడకను నమ్ముకొని పయనం సాగిస్తున్నారు.

migrant labores feet blobble
వాహనాలు లేక కాలినడకన వెళ్తున్న వలస కూలీలు

By

Published : Apr 28, 2020, 1:39 PM IST

వాహనాలు లేక కాలినడకన వెళ్తున్న వలస కూలీలు

వివిధ రాష్ట్రాలకు చెందిన వారు ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లారు. రకరకాల పనులు చేసుకొంటూ పొట్టనింపుకొన్నారు. కరోనా మహమ్మారితో పనులన్నీ నిలిచిపోయాయి. పూట గడవడం కష్టమైంది.. లాక్‌డౌన్‌ ఎన్ని రోజులుంటుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వలస కూలీలు సొంతూళ్లకు బయలుదేరారు. వాహనాలు లేకపోవడం వల్ల కాలినడకన వెళ్తున్నారు.

నిజామాబాద్​ జిల్లా పరిధిలో జాతీయ రహదారి వెంట ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన కూలీలు ఎక్కువగా ఉంటున్నారు. జాతీయరహదారి వెంట ఉన్న పల్లెలు వలస కూలీలను అక్కున చేర్చుకొంటున్నాయి. రాత్రిళ్లు వసతి కల్పించడమే కాకుండా అన్నదానాలు చేస్తూ అండగా నిలుస్తున్నారు. భిక్కనూరు మండలం జంగంపల్లికి చెందిన దాతలు మూడు ప్రాంతాల్లో అన్నదానం చేస్తున్నారు.

బాధ్యత ఓ చేతిలో.. బరువు మరో చేతిలో..

నాలుగురోజులుగా తిండి దొరకడంలేదని. మరో మూడునెలల వరకు పని లేదని మేస్త్రీ చెప్పడం వల్ల సొంతూరి బాట పట్టామన్నారు మధ్యప్రదేశ్‌కు చెందిన దీపక్‌ . రెండ్రోజుల క్రితం చిన్నారులతో కలిసి రామంతపూర్‌ నుంచి బయలుదేరాం. ఇంటికి చేరే సరికి ఇంకో వారం పడుతుంది. ఈ కష్టం శత్రువులకు కూడా రావొద్దని దేవుణ్ని ప్రార్థిస్తున్నామని చెప్పారు.

మాయదారి రోగం పొట్టన పెట్టుకొనేలా ఉంది...

ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించడం వల్ల నెలరోజుల నుంచి ఉపాధి కరవైందన్నారు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సోమా. ఇన్ని రోజులు ఒకపూట కడుపునింపుకొని బతికాం. ఇక తినడానికి తిండి లేక సొంతూరికి బయల్దేరాం. మరో నాలుగు రోజుల్లో మా ఊరికి చేరుకుంటాం. దారిపొడవునా దాతల సాయంతో పొట్ట నింపుకుంటున్నాం. చిన్నారుల కాళ్లకు బొబ్బలు వస్తుండటం వల్ల వారిని ఎత్తుకొనే నడుస్తున్నాం. ఆ మాయదారి రోగం సోకకుండానే మమ్మల్ని పొట్టన పెట్టుకొనేలా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి...

గూడు చేరని జాలర్ల గోడు

ABOUT THE AUTHOR

...view details