ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నడిచైనా వెళ్లిపోతాం సార్​.. మమ్మల్ని పంపించండి! - వలస కూలీలపై లాక్​డౌన్ ఎఫెక్ట్ న్యూస్

కరోనా లాక్​డౌన్ కారణంగా ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న వలస కూలీలు.. తమను సొంత రాష్ట్రానికి పంపించాలంటూ ఆందోళన చేపట్టారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని ఓ పరిశ్రమలో పనిచేస్తున్న ఝార్ఖండ్ వాసులు.. నడిచి వెళ్లేందుకైనా అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు.

migrant laborers protest for moving to their own states due to corona lockdown at jaggayyapeta in krishna
migrant laborers protest for moving to their own states due to corona lockdown at jaggayyapeta in krishna

By

Published : May 9, 2020, 2:44 PM IST

కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని వలస కూలీలలు.. తమను సొంత రాష్ట్రానికి పంపాలంటూ ఝార్ఖండ్ కు చెందిన వలస కార్మికులు ఆందోళన చేపట్టారు. జగ్గయ్యపేట ప్రాంతంలోని ఎమ్మెల్సీ కర్మాగారంలో.. ఎల్​ అండ్​ టీ ద్వారా జరిగే నిర్మాణ పనులను చేపడుతున్న వారంతా.. నిరసన వ్యక్తం చేశారు.

శుక్రవారం రాత్రి విజయవాడ నుంచివెళ్లే రైల్లో 650 మందిని పంపేందుకు అన్ని ఏర్పాట్లు జరిగినా.. ఝార్ఖండ్ ప్రభుత్వం నుంచి అనుమతి రాని కారణంగా ఆగిపోయారు. నిరాశ చెందిన కార్మికులు.. నడిచి వెళ్లిపోతామని పట్టుబట్టారు. మంగళవారం లోపు అందరినీ పంపుతామని.. పోలీసులు హామీ ఇవ్వగా ఆందోళను విరమించారు.

ABOUT THE AUTHOR

...view details