MURDER: మద్యం మత్తులో ఇద్దరి మధ్య ఏం జరిగింది? - కృష్ణా జిల్లా
06:15 August 26
అర్థరాత్రి ఘటన
మద్యం మత్తులో వ్యక్తిని హత్య చేసిన సంఘటన కృష్ణా జిల్లా కొండూరు మండలంలో అర్ధరాత్రి జరిగింది. విజయవాడ నుంచి మార్బుల్ పని కోసం వచ్చిన విజ్ఞేశ్వరరావు, అప్పలస్వామి (48) అనే వ్యక్తులు మద్యం తాగారని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో చిననందిగామలో వారిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. కోపంతో విజ్ఞేశ్వరరావు, అప్పలస్వామిని నరికాడని పోలీసులు వెల్లడించారు. క్షతగాత్రుడిని మైలవరం ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు తెలిపారు. హత్య చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి:చనిపోతున్నానంటూ సెల్ఫీ వీడియో.. ఆ తర్వాత అదృశ్యం