ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'తప్పుడు దరఖాస్తులపై కఠిన చర్యలు' - gopalakrishna dwivedi

ఓటరు జాబితా నుంచి దురుద్దేశపూర్వకంగా పేర్ల తొలగింపునకు దరఖాస్తు చేసే వారిపై రాష్ట్ర ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఈ విషయమై తొమ్మిది జిల్లాల పరిధిలో 45 కేసుల నమోదుకు పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.

సమగ్ర దర్యాప్తుకు ఆదేశం

By

Published : Mar 3, 2019, 9:19 PM IST

Updated : Mar 4, 2019, 7:49 AM IST

సమగ్ర దర్యాప్తుకు ఆదేశం

ఓటర్ల జాబితా నుంచిదురుద్దేశపూర్వకంగా పేర్ల తొలగింపునకు దరఖాస్తు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామనిరాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఈ విషయమై తొమ్మిది జిల్లాల పరిధిలో 45 కేసుల నమోదుకు పోలీసులకు ఆదేశించారు. సమగ్ర దర్యాప్తు జరపాలని కోరారు. కుట్రపూరితంగా ఓట్ల తొలగింపునకు దరఖాస్తు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. బాధ్యులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని... జిల్లా కలెక్టర్లు నేరుగా FIR నమోదు చేయించాలని ఆదేశాలు జారీ చేశారు.

9 జిల్లాల పరిధిలో...

తొమ్మిది జిల్లాల పరిధిలో ఫారం-7 దుర్వినియోగం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఇందులోతూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 14 కేసులు నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది. విశాఖ, కర్నూలు జిల్లాల్లో 8 కేసులు... ప్రకాశం జిల్లాలో 4... శ్రీకాకుళం, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో 3 కేసులు నమోదయ్యాయి. గుంటూరు, అనంతపురం జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైంది.

Last Updated : Mar 4, 2019, 7:49 AM IST

ABOUT THE AUTHOR

...view details