ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉపాధి హామీ బిల్లులను తక్షణమే చెల్లించాలి: తంగిరాల సౌమ్య - krishna district latest news

రెండేళ్లుగా పెండింగ్​లో ఉన్న ఉపాధి హామీ బిల్లులను తక్షణమే చెల్లించాలని తెదేపా నాయకురాలు తంగిరాల సౌమ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు కృష్ణాజిల్లా వీరులపాడు మండలం గోకరాజుపల్లిలో ఆమె నిరసన తెలిపారు.

tdp leader tangirala sowmya
tdp leader tangirala sowmya

By

Published : Dec 5, 2020, 3:32 PM IST

ఉపాధి హామీ పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య డిమాండ్ చేశారు. కృష్ణాజిల్లా వీరులపాడు మండలం గోకరాజుపల్లిలో పసుపు చైతన్యం కార్యక్రమంలో పాల్గొన్న ఆమె... తెదేపా నాయకులతో కలిసి నిరసన తెలిపారు. రెండేళ్లుగా పెండింగ్​లో ఉన్న బిల్లులను చెల్లించాలన్నారు.

అలాగే తెదేపా ప్రభుత్వ హయాంలో నిర్మించిన చెత్త నుంచి సంపద కేంద్రాలను.. అధికారంలోకి రాగానే వైకాపా నిర్వీర్యం చేసిందని సౌమ్య ఆరోపించారు. సుమారు 6-7 లక్షల రూపాయలతో నిర్మించిన ఈ కేంద్రాలు శిథిలావస్థకు చేరాయన్నారు. నిరుపయోగంగా మారిన చెత్త నుంచి సంపద కేంద్రాలను వాడుకలోకి తీసుకురావాలని ఆమె డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details