ఉపాధి హామీ బిల్లుపై 10 జిల్లాల అధికారులతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమావేశం నిర్వహించారు. బిల్లుకు సంబంధించి విడుదల చేసిన నిధులు.. చేయాల్సిన నిధులపై చర్చించారు. ప్రతి నియోజకవర్గానికి 50 కోట్లు కేటాయించి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. గ్రామాల్లో ఉపాధిహామి కింద పనులు చేపట్టేందుకు 8 వేల కోట్లతో ప్రతిపాదనలు రూపొందించినట్లు మంత్రి స్పష్టంచేశారు. ఇప్పటికే 2 వేలకోట్లకు అనుమతులు ఇచ్చినట్లు వెల్లడించారు.
రాష్ట్రానికి కేటాయించిన 6621.99 కోట్లలో ఇప్పటి వరకు 4423.09 కోట్ల రూపాయల పనులను చేపట్టట్టామని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 8వేల 146 గ్రామ సచివాలయాలను నిర్మించేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఇప్పటికే 5వేల 202 సచివాలయాలకు పరిపాలనా అనుమతులు ఇచ్చామని.. ఇందుకోసం 1,582 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 8వేల 145 సీసీ మురుగు కాలువలను మంజూరు చేశామన్నారు. వీటిల్లో 190 కోట్ల రూపాయల విలువైన 1032 పనులకు పరిపాలనా అనుమతులు ఇచ్చామన్నారు.