ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"సర్వసభ్య సమావేశాన్ని వాయిదా వేయండి" - కృష్ణా జిల్లాలో గొర్రెల పెంపకం దార్ల సహకార సంఘం తాజా వార్తలు

ముత్యాలంపాడులో పశుసంవర్ధక శాఖ కార్యలయం ఎదుట గొర్రెల పెంపకం దార్ల సహకార సంఘం నిరనకు దిగింది. సర్వసభ్య సమావేశాన్ని వాయిదా వేయాలని డిమాండ్ చేసింది.

sheep breeding co-operative society
గొర్రెల పెంపకం దార్ల సహకార సంఘం సభ్యుల ఆందోళన

By

Published : Sep 15, 2020, 9:35 AM IST

విజయవాడ ముత్యాలంపాడు పశుసంవర్ధక శాఖ కార్యాలయం ఎదుట.. గొర్రెల పెంపకం దార్ల సహకార సంఘం సభ్యులు ఆందోళన చేపట్టారు. సర్వసభ్య సమావేశాన్ని వాయిదా వేయాలని సంఘం చైర్మన్ గొరిపర్తి రామకృష్ణ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. సభ్యుల అభిప్రాయాలు తీసుకోకుండా కొత్త ఛైర్మన్ ను నియమించారని ఆరోపించారు.

అధికారపార్టీ ప్రజాప్రతినిధుల సూచనలను పాటిస్తూ.. పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రస్తుత ఛైర్మన్ రామకృష్ణ తెలిపారు. గతంలో హైకోర్టుకి వెళ్ళి పదవిపై స్టే తెచ్చుకున్నప్పటికి జిల్లా మంత్రుల ఒత్తిడి మేరకే జేడీ ఇలాంటి అనాలోచిత చర్యలకు పాల్పడుతున్నారన్నారు. సర్వసభ్య సమావేశం ఆలోచన విరమించుకోవాలని కోరారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details