2022 ప్రపంచకప్‌కు ఎంపికైన భారత మహిళా క్రికెట్ జట్టులో సబ్బినేని మేఘనకు.. స్టాండ్‌బై ప్లేయర్‌గా.. చోటు దక్కింది. మేఘన స్వస్థలం కృష్ణా జిల్లా నాగాయలంక. తల్లిదండ్రులు శ్రీనివాసరావు, మాధవి ఉద్యోగ రీత్యా రెండు దశాబ్దాల క్రితం నాగాయలంక నుంచి.. విజయవాడ వెళ్లారు. విద్యుత్తుశాఖలో ఏఈగా పనిచేస్తున్న శ్రీనివాసరావు రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ రాష్ట్రంలోని మిర్యాలగూడలో స్థిరపడ్డారు. శ్రీనివాసరావు రెండో కుమార్తె మేఘన.. క్రికెట్‌పై ఆసక్తి పెంచుకుంది. పలు పోటీల్లో పాల్గొని.. ప్రతిభను నిరూపించుకుంది. ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టే అవకాశం దక్కించుకుంది. మార్చి 4 నుంచి.. ఏప్రిల్ 3 వరకు న్యూజిలాండ్‌లో జరిగే, ప్రపంచకప్ పోటీల్లో భారత్ తరఫున మేఘన ఆడే అవకాశం ఉంది.
విశ్వవ్యాప్తంగా సత్తాచాటనున్న మేఘన.. అంతర్జాతీయ క్రికెట్‌లో మెరవనున్న దివిసీమ బిడ్డ - ap latest news
దివిసీమ అమ్మాయి అంతర్జాతీయ క్రికెట్‌లో మెరవబోతోంది. నాగాయలంకకు చెందిన మేఘన మహిళల టీ20 ప్రపంచకప్ జట్టుకు స్టాండ్‌బై ప్లేయర్‌గా ఎంపికైంది. మన మైదానాల్లో రాటుదేలిన మేఘన.. విశ్వవ్యాప్తంగా సత్తాచాటాలని క్రీడాభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
మేఘన పదోతరగతి వరకు విజయవాడలో విద్యను అభ్యసించింది. గొల్లపూడిలోని ప్రైవేటు కళాశాలలో ఇంటర్, విజయవాడలో డిగ్రీ పూర్తి చేసింది. దేశం తరఫున ఆడుతున్న మేఘన దివిసీమకు మంచిపేరు తేవాలని నాగాయలంకవాసులు ఆకాంక్షిస్తున్నారు. మేఘన ప్రస్తుతం ఇండియన్ రైల్వే జట్టుకు ఆడుతూ.. సికింద్రాబాద్‌లో ఉంటోంది. ప్రస్తుత దేశవాళీ పోటీల్లో 2020-21, 2021-22 సీజన్లలో మేఘన టాపర్‌గా ఉంది.
ఇదీ చదవండి:CLASSES MERGING EFFECT: తరగతుల విలీనంతో.. విద్యార్థులకు బడి దూరం.. చదువు భారం
TAGGED:
ap latest news