ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మేఘా' దాతృత్వం... పామర్రు ఆస్పత్రికి అంబులెన్స్ అందజేత - meil donate ambulance to pamarru govt hospital

'మేఘా' సంస్థ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా పామర్రు ఆస్పత్రికి అంబులెన్స్​ను అందించారు. అత్యవసర వైద్యం అవసరమైన వారి కోసం ఈ ఏర్పాటు చేసినట్లు సంస్థ ప్రతినిధి కొమ్మారెడ్డి బాపిరెడ్డి తెలిపారు.

Megha engineering &isfrastructure limited
పామర్రు ఆస్పత్రికి అంబులెన్స్ అందజేత

By

Published : Jun 6, 2021, 7:54 PM IST

కృష్ణా జిల్లా పామర్రు ఆస్పత్రికి మేఘా ఇంజినీరింగ్, ఇన్​ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(ఎంఈఐఎల్) సంస్థ రూ.20 లక్షలు విలువ చేసే అంబులెన్స్​ను అందజేసింది. సామాజిక బాధ్యతలో భాగంగా అంబులెన్స్​ను అందించినట్లు సంస్థ ప్రతినిధి కొమ్మారెడ్డి బాపిరెడ్డి తెలిపారు. ఫలితంగా అత్యవసర వైద్యం అవసరమైన వారికి ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు తమ సంస్థ ఆధ్వర్యంలో కోటి 40 లక్షల లీటర్లు సామర్థ్యం కలిగిన 14 క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకులను అందించినట్లు బాపిరెడ్డి వెల్లడించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details