పారా ఒలింపిక్స్ కు సిద్ధం - vijayawada
పారా స్పోర్ట్స్ అసోసీయేషన్ ఆంధ్రప్రదేశ్ జనరల్ బాడీ మీటింగ్ విజయవాడ ఏపీ ఎన్జీవో భవనంలో జరిగింది.పారా క్రీడాకారులకు ఎటువంటి సాధనలు అవసరం అన్నింటినీ సమకూరుస్తామని సమావేశంలో అన్నారు.
పారా ఒలింపిక్స్ కు సిద్ధం
పారా ఒలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా నుండి గుర్తింపు పొందిన పారా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు కోటేశ్వర్ రావు మాట్లాడుతూ రాష్ట్ర విభజన తరువత ఆంధ్రప్రదేశ్ లో ఉన్న క్రీడాకారులు నష్టపోయారన్నారు. 2020లో జరగబోయే పారా ఒలింపిక్స్ క్రీడాకారులు సిద్ధంకావాలని అందుకు తగ్గ శిక్షణలు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఈ సమావేశానికి 13 జిల్లాలకు చెందిన పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.