ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

''మీ సేవ'' కేంద్రాల్లో... అన్ని సేవలను కొనసాగించండి - mee seva operators dharna news in vijayawada

గ్రామ వార్డు, సచివాలయాలతో పాటు 'మీ సేవ' కేంద్రాల్లో అన్ని సేవలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ... వాటి నిర్వహకులు చేపట్టిన నిరసనలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేయాలని ప్రభుత్వానికి 'మీ సేవ' నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.

http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/28-December-2019/5521027_1081_5521027_1577535360252.png
రెండో రోజుకు చేరుకున్న మీ సేవ నిర్వాహకుల నిరసనలు

By

Published : Dec 28, 2019, 5:56 PM IST

రెండో రోజుకు చేరుకున్న మీ సేవ నిర్వాహకుల నిరసనలు

'మీ సేవ' కేంద్రాల్లో అన్ని సేవలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ... ఆ కేంద్రాల నిర్వాహకులు విజయవాడలో చేపట్టిన నిరసనలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా తక్కువ ఆదాయం వస్తున్న నిర్వాహకులను గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్​గా నియమించాలని కోరారు. సచివాలయం, మీ సేవ కేంద్రాల్లో అందించే... సేవల విధానంలో ఏకసారూప్యత ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 11 వేల మంది 'మీ సేవా' కేంద్రాల ద్వారా ప్రజలకు సేవలందిస్తూ... ఉపాధి పొందుతున్నారని గుర్తు చేశారు.

ABOUT THE AUTHOR

...view details