ఓవైపు సముద్రం, మూడు పక్కల కృష్ణా నది మధ్యన ఉన్న దివిసీమ.. వేలాది ఔషధ మొక్కలకు నిలయంగా మారింది. కృష్ణా కుడి, ఎడమ కరకట్టలపై ఇవి విరివిగా లభిస్తున్నాయి. సారవంతమైన భూములు, ఏటా సమృద్ధిగా నీరు ఉండటం వల్ల ఈ మొక్కలు దృఢంగా పెరుగుతున్నాయి. మోపిదేవి, చల్లపల్లి మండలాల్లో వేసే కూరగాయల పంటల్లోని మొక్కలను ఇన్నాళ్లూ కలుపుగా భావించిన రైతులు.. ఇప్పుడు వాటి విలువ తెలుసుకుంటున్నారు. రైతుల పొలాల్లో ముల్లవంకాయలు, తిప్పతీగ, గుంట గలగర వంటి అనేకరకాల ఔషధ మొక్కలు లభిస్తున్నాయి.
దివిసీమలో ఔషద మొక్కలు.. అమ్ముకునేందుకు అనుమతి కోరుతున్న రైతులు - ఈరోజు కృష్ణా జిల్లా దివిసీమ తాజా వార్తలు
కరోనా బారి నుంచి కాపాడుకునేందుకు ఇప్పుడు అలోపతి మాత్రమే కాకుండా.. ఇతర వైద్యాలపైనా దృష్టి కేంద్రీకృతమైంది. ఆయుర్వేద మందుల పట్ల ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. కృష్ణా జిల్లా దివిసీమలోని పంటపొలాల్లో వేలాదిగా ఔషధ మొక్కలు లభిస్తున్నాయి. వీటిని అమ్ముకునేందుకు దారి చూపాలని రైతులు కోరుతున్నారు.
దివిసీమలో ఔషద మొక్కలు