కృష్ణాజిల్లా నూజివీడు పట్టణంలోని పోలీస్ క్వార్టర్స్‌లో గిఫర్డ్ మెమోరియల్ ఆసుపత్రి వారు పోలీసు సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు వైద్య శిబిరం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు ఈ శిబిరాన్ని ప్రారంభించారు. కరోనా మహమ్మారి రెండవ దశలో తన వికృత రూపాన్ని చూపుతోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ తెలిపారు. మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ శిబిరంలో పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులను వైద్య నిపుణులు పరీక్షించి.. ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
నూజివీడు పోలీస్ క్వార్టర్స్‌లో వైద్య శిబిరం - noojeedu updates
గిఫర్డ్ మెమోరియల్ ఆసుపత్రి వారు కృష్ణా జిల్లా నూజివీడు పట్టణంలోని పోలీస్ క్వార్టర్స్‌లో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పోలీసులను, వారి కుటుంబ సభ్యులను పరీక్షించి.. మందులను పంపిణీ చేశారు.
నూజివీడు పోలీస్ క్వార్టర్స్‌లో వైద్య శిబిరం