మార్చి, ఏప్రిల్లో జరగాల్సిన వైద్య విద్య పరీక్షలు కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. లాక్డౌన్ సడలింపుతో పరీక్షల నిర్వహణ ప్రక్రియను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అధికారులు ప్రారంభించారు. విడతల వారీగా ఎంబీబీఎస్, బీడీఎస్, నర్సింగ్, పీజీ వైద్యకు సంబంధించిన రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించామని వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్ డా. దుర్గా ప్రసాద్ తెలిపారు.
ఎంబీబీఎస్, బీడీఎస్ కొన్ని తరగతుల పరీక్షలను నవంబర్లో నిర్వహిస్తామని ఆయన అన్నారు. ఇప్పటివరకు జరిగిన పరీక్షల్లో 20 వేల మంది విద్యార్ధులు వివిధ పరీక్షలకు హాజరై ఉంటారని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద కరోనా నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించామన్నారు. కోవిడ్ సోకిన విద్యార్ధులకు పీపీఈ కిట్లు ధరించి ప్రత్యేక గదుల్లో రాసే విధంగా చర్యలు తీసుకున్నట్లు సీవోఈ తెలిపారు.