కృష్ణా జిల్లా మోపిదేవి తహసీల్ధార్ కార్యాలయ ఆవరణలో మే పుష్పం వికసించింది. గతంలో ఇక్కడ పనిచేసిన తహసీల్ధార్ విమల కుమారి మొక్కను నాటగా మేలో వికసించాల్సిన పుష్పం జూన్లో వికసించింది. కరోనా కాలంలో వికసించిన ఈ పుష్పాన్ని చూసి అందరూ కరోనా ఆకారంలో ఉందని వింతగా చూస్తున్నారు. దీంతో ప్రతి రోజు తహసీల్ధార్ కార్యాలయానికి వచ్చే వందల మందికి ఈ మే పుష్పం నేత్రానందం కలిగిస్తుంది.
కరోనా ప్రభావమో ఏమో... జూన్లో కనువిందు చేసిన మే పుష్పం - mopidevi tahashildar latest news
ప్రభుత్వ కార్యాలయం అనగానే అందవిహీనంగా, ఎప్పుడో కట్టిన బిల్డింగ్లు, పిచ్చి మొక్కలతో ప్రాంగణం ఉంటుంది అనుకుంటాం.. కానీ మోపిదేవి తహసీల్ధార్ కార్యాలయం మాత్రం రకరకాల పూల మొక్కలతో అలరాడుతుంది. అయితే ఇక్కడ నాటిన ప్రసిద్ది మొక్క మే నెలలో పూయాల్సిన పుష్పం జూన్లో కనువిందు చేసింది.
మోపిదేవి తహసీల్ధార్ కార్యాలయం లో మే పుష్పం