ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

sexual assault on students: విద్యార్థినుల పట్ల లైంగిక వేధింపులు.. కీచక టీచర్​కు దేహశుద్ధి - maths teacher sexual assault on students

sexual assault on students: ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కీచక ఉపాధ్యాడికి తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. దీనిపై నందిగా డీవైఈఓకు ఫిర్యాదు చేశారు.

sexual assault on students
sexual assault on students

By

Published : Dec 7, 2021, 2:52 AM IST

sexual assault on students: కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ప్రభుత్వ బాలుర హైస్కూల్లో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థినుల పట్ల లెక్కల మాస్టారు అసభ్యకరంగా ప్రవర్తించినట్లు తెలిపారు. బాలికల ఇచ్చిన సమాచారం మేరకు పాఠశాలకు చేరుకున్న వారి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు విద్యార్థులను లైంగికంగా వేధించిన లెక్కల మాస్టారు శుక్లవత్తు రాముకి దేహశుద్ధి చేశారు. సదరు ఉపాధ్యాయుడిని పాఠశాలలోనే చితకబాదారు. బాలికల తల్లిదంత్రులు దీనిపై నందిగామ డీవైఈఓ వేణుగోపాల్​కు ఫిర్యాదు చేశారు. పాఠశాలను సందర్శించిన అధికారి బాధిత విద్యార్థినుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. బాలికలను లైంగికంగా వేధించిన సదరు ఉపాధ్యాయుడుపై విద్యాశాఖ జిల్లా అధికారులకు నివేదిక అందినచనున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details