నాడు-నేడు పనుల్లో అక్రమాలు - పెద్ద మొత్తంలో ఇనుము, సిమెంట్ మాయం Material Scam in Kothapalem zilla Parishat School: రాష్ట్రంలో పాఠశాల మౌలిక సదుపాయాలు మెరుగు పరచటం కోసం జగన్ సర్కారు నిర్వహిస్తున్న నాడు-నేడు కార్యక్రమంలో అవకతవకలు జరగడంపై కె.కొత్తపాలెం గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లా కె.కొత్తపాలెంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నాడు- నేడు పనుల కోసం కేటాయించిన మెటీరియల్‌లో 174 సిమెంటు బస్తాలు, 4 టన్నుల ఇనుము తగ్గినట్టు గుర్తించామని అధికారులు తెలిపారు.
Nadu Nedu Material Scam in Mopineni Mandal: గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం మోపిదేవి మండలం కె.కొత్తపాలెం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నాడు- నేడు పనులకు పేజ్-2 కింద రూ.89.98 లక్షల కేటాయించారు. పాఠశాలలో అదనపు తరగతి గదులు నిర్మాణ పనులు చేయడానికి 2022లో శంకుస్థాపన చేశారు. గత సంవత్సరం ప్రారంభించిన పనులు ఏడాది దాటినా ఇంకా జరుగుతూనే ఉన్నాయి. పాఠశాల భవనంలో భద్రపరచిన సిమెంట్, ఇనుము బయటకు తరలిస్తున్నట్టు ఇటీవల గ్రామంలో పుకార్లు వచ్చాయి. దీంతో గ్రామస్థులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
"పాఠశాల భవనం అదనపు తరగతి గదుల నిర్మాణ మెటీరియల్‌లో జరిగిన అవకతవకలపై స్పందనలో ఫిర్యాదు చేశాం. దోషులను కఠినంగా శిక్షించాలి" -గ్రామస్థులు
నాడు నేడు బిల్లులు చెల్లించాలని ఆత్మహత్యకు ప్రయత్నించిన విద్యా కమిటీ చైర్ పర్సన్
దీనిపై విద్యాశాఖ అధికారులు సర్వశిక్షా అభియాన్ ఏఏవో శ్యాం సుందరరావు, ఎఈవో రాజ్ కుమార్ స్కూల్‌ను విజిట్ చేశారు. మెటీరియల్ సంబంధిత అంశాలను పరిశీలించారు. పాఠశాలకు ఎంత మెటీరియల్ మంజూరు అయింది, ఎంత శాతం పనులు జరిగాయి, ఎంత శాతం వినియోగించారు అని అధికారులు లెక్క గట్టారు. ఈ గణాంకాల్లో 174 సిమెంట్ బస్తాలు, 4 టన్నుల ఇనుము తగ్గినట్లు అధికారులు వెల్లడించారు. అధికారులు పూర్తి విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
"పాఠశాలలో రాత్రి వాచ్మెన్, పగలు ఉపాధ్యాయులు ఉండగా 174 సిమెంట్ బస్తాలు, 4 టన్నుల ఇనుము ఎలా మాయం అయ్యాయి. అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి మాయం చేసిన మెటీరియల్ రికవరీ చేయాలి." -టీడీపీ, జనసేన నాయకులు
Nadu Nedu Funds Drawn with Forgery Signatures ఫోర్జరీ సంతకాలతో నాడు నేడు నిధులను స్వాహా ..
నాడు-నేడు కార్యక్రమం ద్వారా పాఠశాల మౌలిక వసతులు మెరుగుపరుస్తుంటే వాటిని కూడా కాజేయడానికి వెనకాడడం లేదని టీడీపీ జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దోషులపై తగిన చర్యలు తీసుకోవాలని టీడీపీ, జనసేన నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
YSRCP Government Negligence in Nadu Nedu Works: నాడు-నేడు పనుల్లో బయటపడుతున్న డొల్లతనం.. ఇదేనా మీరు మార్చిన రూపురేఖలు సీఎం గారూ.?