ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దేశంలో భారీగా పెరిగిన విద్యుత్తు డిమాండ్‌ - దేశంలో పెరిగిన విద్యుత్ వినియోగం

దేశంలో అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో.. విద్యుత్తు డిమాండ్‌ పెరిగింది. ఇప్పటికే వినియోగం 200 గిగావాట్లను దాటింది.బహిరంగ మార్కెట్​లో యూనిట్ ధర పెరగడంతో.. మూసేసిన విద్యుత్ ప్లాంట్లను తెరవాలని డిస్కంలు కోరాయి.

Massively increased electricity demand in the country‌
దేశంలో భారీగా పెరిగిన విద్యుత్తు డిమాండ్‌

By

Published : Jul 9, 2021, 7:25 AM IST

దేశంలో విద్యుత్‌ డిమాండ్‌ రికార్డుస్థాయిలో 200 గిగావాట్ల మార్క్‌ను బుధవారం రాత్రి దాటింది. ఈ సమయానికి వర్షాల వల్ల ఉత్తరాది రాష్ట్రాల్లో విద్యుత్‌ వినియోగం తగ్గాలి. కానీ, వర్షాభావ పరిస్థితులతో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం.. వ్యవసాయ పనులు పూర్తి కాకపోవటంతో వినియోగం పెరిగిందని విద్యుత్‌శాఖ వర్గాలు పేర్కొన్నాయి. జాతీయ గ్రిడ్‌కు ఇబ్బంది రాకుండా అన్ని విద్యుత్‌ కేంద్రాల నుంచి ఉత్పత్తి వచ్చేలా చర్యలను చేపట్టారు. ఇప్పటివరకూ గరిష్ఠ విద్యుత్‌ వినియోగం 197 గిగావాట్లు.

ధరలు పెరిగాయి

డిమాండ్‌ పెరగటంతో బహిరంగ మార్కెట్‌లో యూనిట్‌ ధర పెరిగింది. పీక్‌ డిమాండ్‌ సమయంలో యూనిట్‌ రూ.9కి కొనాల్సి వస్తోందని అధికారులు పేర్కొన్నారు. దీంతో.. రాయలసీమ థర్మల్‌ విద్యుత్‌ ప్లాంటు(ఆర్‌టీపీపీ)లో సాంకేతిక కారణాలతో మూసేసిన 210 మెగావాట్ల యూనిట్‌ను వెంటనే వినియోగంలోకి తేవాలని డిస్కంలు కోరాయి. దీనినుంచి యూనిట్‌ రూ.3.86 వంతున అందుబాటులోకి వస్తుంది. అలాగే యూనిట్‌ రూ.3.12 వంతున వచ్చే కృష్ణపట్నంలోని రెండు యూనిట్ల నుంచి గరిష్ఠ విద్యుత్‌ ఉత్పత్తి చేయాలని డిస్కంలు ప్రతిపాదించాయి.

ఇదీ చూడండి.రూ.41 వేల కోట్ల చెల్లింపులకు ఎలాంటి లెక్కాపత్రనం లేవు: పయ్యావుల

ABOUT THE AUTHOR

...view details