నలుగురి ప్రాణాలు తీసిన సెల్ఫోన్ డ్రైవింగ్..! - updates in nandhigam accident
కృష్ణా జిల్లా నందిగామ వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న డీసీఎం వాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఫోన్లో మాట్లాడుతూ... అతి వేగంగా కారు నడపడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
![నలుగురి ప్రాణాలు తీసిన సెల్ఫోన్ డ్రైవింగ్..! massive road accident at nandhigam... four died](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5279728-72-5279728-1575548296256.jpg)
నందిగామలో ఘోర ప్రమాదం
నందిగామలో ఘోర ప్రమాదం
కృష్ణాజిల్లా నందిగామ వద్ద జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. పట్టణ శివారులోని అంబారుపేట వద్ద ఆగి ఉన్న డీసీఎం వాహనాన్ని కారు ఢీకొట్టింది. అతివేగంగా వచ్చి ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. వీరందరూ నందిగామకు చెందినవారే. మరొకరికి తీవ్ర గాయాలవగా... అతడిని నందిగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అతివేగంతో పాటు ఫోన్ మాట్లాడుతూ... కారు నడపడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.
Last Updated : Dec 5, 2019, 6:24 PM IST