ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాస్కుల తయారీలో ఖైదీలు నిమగ్నం - మాస్కులు తయారీ చేస్తున్న ఖైదీలు

మాస్కుల కొరత తీర్చేందుకు జైళ్లల్లో ఖైదీలు తనమునకలయ్యారు. రాష్ట్రంలోని ప్రధాన జైళ్లల్లో ఖైదీలు మాస్కులు తయారు చేస్తూ.. కరోనాపై పోరులో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు.

masks making by prisoners in vijayawada
మాస్కుల తయారీలో ఖైదీలు బిజీ

By

Published : Apr 17, 2020, 9:51 AM IST

కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా మాస్కులకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో మాస్కుల కొరత తీర్చేందుకు అధికారులు.. ఖైదీలకు వీటి తయారీపై శిక్షణ ఇప్పించారు. రాష్ట్రంలో ఏడు జైళ్లల్లో ఖైదీలే మాస్కులు తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఈ మాస్కులనే ప్రభుత్వ కార్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలకు తక్కువ ధరకు సరఫరా చేస్తున్నారు. ప్రజలందరికీ నాణ్యమైన మాస్క్​లను అందించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ప్రారంభించినట్లు కృష్ణా జిల్లా జైలు సూపరింటెండెంట్​ రఘు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details