ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గ్యాస్ డెలివరీ బాయ్స్​కు మాస్కులు పంపిణీ - విజయవాడలో గ్యాస్ డెలివరీ బాయ్స్​కు మాస్కులు పంపిణీ వార్తలు

విజయవాడలో ఇండేన్ గ్యాస్ డెలివరీ బాయ్స్​కు.. గుంటూరు వైద్య కళాశాల 1980 బ్యాచ్ విద్యార్థులు మాస్కులు పంపిణీ చేశారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అత్యవసర విధుల్లో ఉన్నవారికి వాటిని అందజేశారు.

masks distributed to gas delivery boys in vijayaada
గ్యాస్ డెలివరీ బాయ్స్​కు మాస్కులు పంపిణీ

By

Published : Jun 6, 2020, 3:39 PM IST

గుంటూరు వైద్య కళాశాల 1980వ సంవత్సరం బ్యాచ్ విద్యార్థులు కరోనా నియంత్రణకు తమవంతు సాయం అందిస్తున్నారు. సొంతంగా మాస్కులు తయారుచేసి అత్యవసర విధుల్లో ఉన్నవారికి అందిస్తున్నారు. గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రీదేవి ఆధ్వర్యంలో.. విజయవాడలో గ్యాస్ డెలివరీ బాయ్స్​కు ఫేస్ మాస్కులు, గుడ్డ సెల్ ఫోన్ పౌచ్​లు అందించారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ నోరి సూర్యనారాయణ, ఇండేన్ గ్యాస్ డీలర్ల సంఘం అధ్యక్షుడు గిరిజా శంకర్ పాల్గొన్నారు. గిరిజా శంకర్ మాట్లాడుతూ.. వైరస్ వ్యాప్తి అధికమవుతున్న నేపథ్యంలో.. డెలివరీ బాయ్స్ మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. సిలిండర్ డెలివరీ ఇచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

ఇవీ చదవండి.... ముదిరిన వివాదం.. ప్రైవేటు కళాశాలలకు ఎన్టీఆర్ వర్సిటీ నోటీసులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details