కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం శేరిదగ్గుమిల్లిలో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గ్రామానికి చెందిన సూర్యనారాయణకు భార్య జున్ను దేవికి గత కొంత కాలంగా గొడవ పడుతున్నారు. ఈ క్రమంలోనే నిన్న భార్యాభర్తల మధ్య గొడవ జరిగిన తరువాత, దేవి మృతి చెందింది. దేవి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వరకట్నం కోసం తన అక్కను వేధిస్తున్నారని మృతురాలి సోదరుడు నాగరాజు ఆరోపించారు. సంఘాటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.
దంపతుల మధ్య ఘర్షణ..భార్య అనుమానాస్పద మృతి - recent crime news in shridaggumilli news
కృష్ణా జిల్లా శేరిదగ్గుమిల్లి గ్రామంలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వరకట్నం కోసం అత్తింటి వారు వేధించేవారిని మృతిరాలి సోదరుడు ఆరోపించారు.
అనుమానాస్పదంగా వివాహిత మృతి