కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం కోడవటికల్లు గ్రామానికి చెందిన వివాహిత చావలి దీపిక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.వివాహం జరిగిన నాటి నుంచే దీపకకు,భర్త కు మనస్పర్థలున్నాయి.ఇంట్లో ఎవరూ లేని సమయంలో దీపిక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకోగా,ఇబ్రహీంపట్నంలోని ఓ ఆసుపత్రికి తరలించారు.అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించింది.దీపికను ఆమె భర్తే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని భర్త ఇంటి ముందు బంధువులు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని బాధితులకు న్యాయం జరుగుతుందని హామి ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది.
పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య - పురగులమందు
దంపతుల మద్య తరచు మనస్పర్థలు రావడంతో, విసుగు చెంది ఓ వివాహిత పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. చందర్లపాడు మండలం కోడవటటికల్లు లో జరిగిన ఈ ఘటనలో, భర్తే నిందితుడని బంధువులు ఆందోళనకు దిగారు.
పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య