ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భాజపాలోకి మరో కాంగ్రెస్ నేత.. ఇందులో నిజమెంత? - Marri Sashidhar Reddy Comments

మునుగోడు ఉపఎన్నికతో తెలంగాణలో రాజకీయ వేడి పుంజుకుంది. ఇక రానున్న అసెంబ్లీ ఎన్నికలపై అన్ని ప్రధాన పార్టీలు ఫోకస్ పెట్టాయి. ముఖ్యంగా భాజపా.. తెలంగాణలో పాగా వేయాలని చూస్తోంది. మొన్న రాజగోపాల్‌రెడ్డిని తమ పార్టీలో చేర్చుకున్న కమలం పార్టీ.. తాజాగా మరో నేత భాజపాలో చేరుతారని ఈ మధ్య ప్రచారం సాగుతోంది. దీనిపై ఆ కాంగ్రెస్ నేత క్లారిటీ ఇచ్చారు.

Marri Sashidhar Reddy Clarity
Marri Sashidhar Reddy Clarity

By

Published : Nov 16, 2022, 7:53 PM IST

Telangana Politics: మునుగోడు ఉపఎన్నిక తర్వాత తెలంగాణలో రాజకీయాలు ఉత్కంఠగా మారాయి. ఇక రానున్న శాసనసభ ఎన్నికలపై రాజకీయ పార్టీలు నువ్వా నేనా అన్నట్లు రంగంలోకి దిగేందుకు పోటీ పడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అధికార పార్టీతో పాటు.. భాజపా, కాంగ్రెస్‌లు సైతం ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. ఇటీవల రాజగోపాల్‌రెడ్ది భాజపాలో చేరగా... ఆ తర్వాత తెరాస నేత బూర నర్సయ్య గౌడ్ చేరారు. అయితే తాజాగా భాజపాలోకి మరో కాంగ్రెస్ నేత చేరుతారని ప్రచారం సాగుతోంది. దానిపై ఆ నేత క్లారిటీ ఇచ్చేశారు.

భాజపాలో చేరేందుకు దిల్లీ వచ్చానన్న వార్తల్లో వాస్తవం లేదని కాంగ్రెస్ రాష్ట్ర సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. దిల్లీ రావడం తనకు కొత్తకాదని.. తాను వచ్చిన విమానంలో అన్ని పార్టీల నాయకులు ఉన్నారని తెలిపారు. మనవడి స్కూల్‌ ఫంక్షన్ కోసం ఇక్కడకు వచ్చినట్లు స్పష్టం చేశారు. తానింకా రాజకీయాల్లోనే ఉన్నానని.. రిటైర్డ్‌ కాలేదని తెలిపారు.

భాజపాలోకి చేరడం లేదని క్లారిటీ ఇచ్చిన మర్రి

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details