ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతాన్ని మార్కాపురం కేంద్రంగా గిద్దలూరు ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని మార్కాపురం జిల్లా సాధన సమితి డిమాండ్ చేసింది. రాయలసీమకు ముఖ ద్వారంగా.. గుంటూరు జిల్లా సరిహద్దుగా.. కర్నూలు - కడప, నెల్లూరు - ప్రకాశం జిల్లాలకు కూడలిగా ఈ ప్రాంతం ఉందని, దీన్ని ప్రత్యేక జిల్లాగా పరిగణిస్తే అభివృద్ధికి అన్ని రకాల అవకాశాలు ఉంటాయని న్యాయవాది శివప్రసాద్ అన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడారు. ప్రకాశం జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలు మార్కాపురం ఎర్రగొండ పాలెం, గిద్దలూరు, దర్శి, కనిగిరి ప్రాంతాలను కలిపి ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసి.. ఈ ప్రాంతానికి అభివృద్ధి ఫలాలు అందించాలని ఆ ప్రాంత వాసులు బలంగా కోరుకుంటున్నారన్నారు. భా
'మార్కాపురం కేంద్రంగా గిద్దలూరును ప్రత్యేక జిల్లాగా చేయండి'
మార్కాపురం కేంద్రంగా గిద్దలూరును ప్రత్యేక జిల్లాగా చేయాలని మార్కాపురం జిల్లా సాధన సమితి డిమాండ్ చేసింది. విజయవాడలోని ప్రెస్ క్లబ్లో జిల్లా సాధన సమితి సభ్యులు పలు అంశాలను ప్రస్తావించారు.
మార్కాపురం జిల్లా సాధన సమితి