కృష్టా జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లులో 180కిలోల గంజాయి పట్టుబడింది. పోలీసులు స్థానికంగా వాహనాల తనిఖీ నిర్వహించారు. రాజమండ్రి నుంచి మహారాష్ట్రకు రెండు కార్లలో అక్రమంగా తరలిస్తున్న 80గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన సరకు విలువ సుమారు రూ.20 లక్షలు ఉంటుందని అధికారులు వివరించారు.
రూ.20లక్షల విలువైన గంజాయి పట్టివేత.. ఆరుగురు అరెస్ట్ - జగ్గయ్యపేట వార్తలు
రూ.20 లక్షల విలువైన గంజాయిని కృష్టా జిల్లా జగ్గయ్యపేట పోలీసులు పట్టుకున్నారు. రెండు కార్లు, ఆరు చరవాణులను స్వాధీనం చేసుకుని, ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. గంజాయి తరలింపును చాకచక్యంగా అడ్డుకున్న సిబ్బందికి స్థానిక ఎస్పీ వకుల్ జిందాల్ నగదు రివార్డులు అందజేశారు.
గంజాయి పట్టివేత
రెండు కార్లు, ఆరు చరవాణులను సీజ్ చేశారు. ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని జిల్లా అడిషనల్ ఎస్పీ వకుల్ జిందాల్, జగ్గయ్యపేట సీఐ హఫీజ్ అన్నారు. గంజాయిని చాకచక్యంగా స్వాధీనం చేసుకున్న సిబ్బందికి ఎస్పీ వకుల్ జిందాల్ నగదు రివార్డు అందజేశారు.
ఇదీ చదవండి: సీఎం జగన్ ప్రజా సంకల్ప యాత్రకు రెండేళ్లు పూర్తి.. నేతల సంబరాలు