ఖాతాదారుల సొమ్ముకు భద్రతతోపాటు వారి భవిష్యత్ బంగారుమయం చేసేందుకే మార్గదర్శి పనిచేస్తోందని.. సంస్థ ఎండీ శైలజాకిరణ్ అన్నారు. హైదరాబాద్లోని కొంపల్లిలో 107వ శాఖను 'ఈనాడు' ఎండీ కిరణ్తో కలిసి ఆమె ప్రారంభించారు. ఖాతాదారులకు ఎలాంటి సమస్య వచ్చినా నేరుగా పరిష్కరిస్తామన్నారు. మిగతా సంస్థల కంటే ముందుగానే చిట్టీ డబ్బులు చెల్లిస్తూ... ఆదరాభిమానాలు పొందుతున్నామని చెప్పారు. 57 ఏళ్లుగా ఖాతాదారుల మన్ననలు పొందుతోన్న మార్గదర్శి... కొంపల్లిలో బ్రాంచ్ ప్రారంభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. స్థానికులకు అందుబాటులో ఉండాలనే అక్కడ ప్రారంభించినట్లు తెలిపారు.
హైదరాబాద్ కొంపల్లిలో మార్గదర్శి చింట్ఫండ్ 107వ శాఖ ప్రారంభం - margadarshi chitfund branch open in kompalli
హైదరాబాద్లోని కొంపల్లిలో మార్గదర్శి చిట్ఫండ్ 107వ శాఖను ఎండీ శైలజాకిరణ్ ప్రారంభించారు. ఖాతాదారుల సొమ్ముకు భద్రత కల్పించడమే సంస్థ ధ్యేయమని ఆమె చెప్పారు. అత్యుత్తమైన సేవలతో 57 ఏళ్లుగా ఖాతాదారుల ఆదరాభిమానాలు పొందుతున్నామని అన్నారు.
హైదరాబాద్ కొంపల్లిలో మార్గదర్శి చింట్ఫండ్ 107వ శాఖ ప్రారంభం