ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బురద నీరే గతి... గొంతు ఎండి మూగజీవాల మృతి - krishna district

కృష్ణా జిల్లాలో వేసవి తాపం వల్ల మనుషులకే కాక ముగజీవాలు సైతం తీవ్ర కష్టాలు ఎదుర్కొంటుున్నాయి. తాగేందుకు గుక్కెడు నీరు దొరక్క విలవిల్లాడుతున్నాయి.  ఇప్పటికే కొన్ని జీవాలు మరణించగా... మురుగునీరు తాగి మరికొన్ని అనారోగ్యం బారిన పడుతున్నాయి.

బురద నీరే తాగుతున్న జీవాలు

By

Published : May 8, 2019, 7:33 AM IST

మూగబోతున్న జీవాలు

కృష్ణా జిల్లా కోడూరు మండలంలో కరవు తాండవం చేస్తోంది. బసవవానిపాలెం, ఊటగుండం, రామకృష్ణాపురం, ఇరాలి, హంసలదీవి, పాలకాయతిప్ప, విశ్వనాధపల్లి, సాలెంపాలెం, వేణుగోపాలపురం, వి.కొత్తపాలెం గ్రామాల్లో గేదెలు, మేకలు , గొర్రెలకు సైతం గుక్కెడు నీటి కోసం విలవిల్లాడుతున్నాయి. కోడూరు మండలంలో 10 వేల గేదెలు... మేకలు గొర్రెలు కలిపి 7,500 ఉన్నట్లు పశు వైద్య శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ఇన్ని లెక్కలు తెలిసినా... cూగజీవాల తాగునీటి అవసరాల కోసం అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.

అధికారుల నిర్లక్ష్యం

వేసవి దృష్ట్యా పశువుల కోసం కోడూరు మండలంలో ఉపాధి హామీ పథకం నిధులతో ప్రభుత్వం నీటి తోట్టెలు నిర్మించినప్పటికి వాటిలో చుక్క నీరు కనిపించడం లేదు. పశువులే కదా అవి అడగలేవు అనే ధోరణిలో అధికారులు ఉన్నారు. కాంట్రాక్రర్ల కోసం తొట్టెలు నిర్మించి బిల్లులు తీసుకున్నారు కాని వాటికి పంచాయతీ ట్యాంక్ నుంచి నీటిని సరఫరా చేయడం లేదు. నీటి కొరత వల్ల మురికి నీరు తాగి బసవవానిపాలెంలో ఇప్పటికే సుమారు 5 పశువులు మరణించాయి అని పశుపోషకులు ఆవేదన వ్యక్తం చేశారు.

కాలువ నీరు కావాలి

ఇటీవల విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుండి కేఈబీ కాలువ ద్వారా దివిసీమలో కాలువలకు తాగునీరు విడుదల చేసినప్పటికి కాలువ చివరి గ్రామాలకు చేరలేదు. ఆయా గ్రామాల్లో ఉన్న చెరువులను అధికారులు నింపలేదు. ఫలితంగా తాగునీరు సరిపడా లేక పాల దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది అని రైతులు చెబుతున్నారు. కొందరు రైతులు త్రాగునీరు లేక తక్కువ రేటుకు పాడి పశువులు, గొర్రెలను అమ్మివేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నీటి తొట్టెలలో పశువులకు నీరు నింపాలని పశుపోషకులు వేడుకొంటున్నారు. ప్రకాశం బ్యారేజ్ నుండి కేఈబీ కాలువ ద్వారా దివిసీమకు త్రాగునీరు విడుదల చేయాలనీ అక్కడి ప్రజలు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details