అర్ధ శతాబ్దపు వయసున్న ఓ మామిడి చెట్టు... అక్షరాలా లక్ష రూపాయలకు మించి ఆదాయాన్ని తీసుకొస్తోంది. రాష్ట్రంలోని చాలా చోట్ల ఇంకా మామిడి పూత, పిందె దశలో ఉన్న తరుణంలో కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం పరిధిలోని మామిడి మంచి కాపులో ఉంది. ఇక్కడి నుంచి పొరుగు రాష్ట్రాలకు మామిడికాయల రవాణా జరుగుతోంది. ఇటీవల కాలంలో ఎప్పడూ లేని విధంగా అడవికొత్తూరు గ్రామంలోని పెద్దరసాల రకం మామిడి ధర (ఒకే చెట్టు) ఏకంగా 96 వేల రూపాయలు పలికింది.
ఒక్క చెట్టు మామిడికాయల ధర రూ.96 వేలు - కృష్ణా జిల్లా తాజా వార్తలు
కృష్ణా జిల్లాలోని ఓ మామిడిచెట్టు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. 50 ఏళ్ల వయసు ఉన్న ఈ చెట్టు మామిడి కాయలు ఏకంగా 96 వేల రూపాయలకు అమ్ముడయ్యాయి. రైతుల కృషి, వాతావరణం అనుకూలించటం ఫలితంగా ఈ మామిడికి అమాంతం గిరాకీ పెరిగింది.
అంత ధరకు కొనుగోలు చేస్తే ఆ మేరకు ఫల దిగుబడి, రాబడి వస్తుందా..? అని తోటి వ్యాపారుల నుంచి రైతుల వరకు అంతా సందేహించారు. ఇప్పుడు ఈ చెట్టు కొనుగోలుదారినే నివ్వెరపరుస్తోంది. మొత్తం ఈ పంట కాలంలో లక్ష రూపాయలకు మించి ఆదాయాన్ని కొనుగోలుదారికి సమకూరుస్తోంది. దీనిపై విజయవాడ ఉద్యానశాఖ అధికారి దయాకర్బాబు మాట్లాడుతూ... మార్కెట్‌లో ఎక్కడా మామిడి కాయలు రాకపోవడం, ఈ చెట్టు కాయలు ముందుగా రావటంతో ఈ ధర వచ్చిందన్నారు. అలాగే రైతులు సరైన పద్ధతులు పాటించటం, వాతావరణం అనుకూలించటం ఫలితంగా దిగుబడి ఎక్కువగా ఉందని వివరించారు. వీటి నాణ్యత బాగుండటం వల్ల ఈ ధర వచ్చిందని చెప్పారు.
ఇదీ చదవండి:ఇది నిజం... ఒకే కుటుంబంలో నలుగురు ఐపీఎస్లు