ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నందిగామ నగర పంచాయతీ ఛైర్‌పర్సన్‌గా మండవ వరలక్ష్మి - నందిగామ ఛైర్మన్ ఎన్నిక తాజా వార్తలు

కృష్ణాజిల్లా నందిగామ నగర పంచాయతీ ఛైర్‌పర్సన్‌గా వైకాపాకి చెందిన మండవ వరలక్ష్మి, వైస్ ఛైర్మన్​గా మాడుగుల నాగరత్నం ఎన్నికయ్యారు. ఛైర్మన్​, వైస్ చైర్మన్​ల చేత ప్రత్యేక అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు.

Mandava Varalakshmi as Nandigama urban Panchayat Chairman
Mandava Varalakshmi as Nandigama urban Panchayat Chairman

By

Published : Mar 18, 2021, 3:19 PM IST

కృష్ణాజిల్లా నందిగామ నగర పంచాయతీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం

కృష్ణాజిల్లా నందిగామ నగర పంచాయతీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం పూర్తయింది. నందిగామ నగర పంచాయతీ పాలకవర్గ సభ్యులుగా 20 మంది కౌన్సిలర్లు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రత్యేక రిటర్నింగ్‌ అధికారి శ్రీనివాసరావు సభ్యులందరి చేత పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఛైర్‌పర్సన్‌, వైస్ ఛైర్మన్ పదవులకు ఎన్నికలు నిర్వహించారు. ఛైర్మన్​గా వైకాపాకి చెందిన మండవవరలక్ష్మి, వైస్ ఛైర్మన్​గా మాడుగుల నాగరత్నం ఎన్నికయ్యారు. అనంతరం ఛైర్మన్​, వైస్ చైర్మన్​ల చేత ప్రత్యేక అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు.

ABOUT THE AUTHOR

...view details